From power Deficit state to power surplus state new state Telangana to will become the 1st state in country to give "24 hours of free power supply to farmers" and entire state to get 24 hours supply without any interruption . The Government of Telangana announced new year gift to farmers of state to give free power supply for more than 23 lakhs Agriculture pump sets with power demand of 11000 MV by March 2018. It is already know that on experimental basis from June 2017 threes districts of Telangana :- Karimnagar, Medak & Nalgonda has given 24 hours power supply which covers 43 % of pump sets in the Entire state.
అతితక్కువ సమయంలోనే విద్యుత్ సరఫరాలో తెలంగాణ మెరుగైన ఫలితాలు సాధించిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. అన్ని వర్గాలకు 24 గంటలనాణ్యమైన విద్యుత్ అందించడంవల్ల తెలంగాణ ఖ్యాతి పెరిగిందని చెప్పారు. దశాబ్దాల తరబడి తెలంగాణ రైతులు కరంట్ గోసలు అనుభవించారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడ ఈ కష్టాలు కొనసాగడం అర్థరహితమని భావించాం. అందుకే విద్యుత్ సరఫరా మెరుగుదలకు ప్రాధాన్యం ఇచ్చాం. రైతులకు 24 గంటల కరంటు ఇవ్వడాన్ని గొప్ప అవకాశంగా భావిస్తున్నాం. రైతులకు మేలుచేయడంకన్నా మించిన సంతృప్తి మరొకటి ఉండదు. రైతులతోపాటు అన్ని వర్గాలకు 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని నిర్ణయించాం. ఇందుకు అనుగుణంగా విద్యుత్ సంస్థలు, ఉద్యోగులు పనిచేశారు. ఫలితంగానే ఇప్పుడు అన్నివర్గాలకు 24 గంటల విద్యుత్ అందించే రాష్ట్రంగా తెలంగాణను ప్రకటించుకుంటున్నాం. విద్యుత్ సరఫరా మెరుగ్గా ఉంటేనే పరిశ్రమలు వస్తాయి. పారిశ్రామికాభివృద్ధి జరుగుతుంది. రైతులకు సాగునీరు, ప్రజలకు మంచినీరు ఇవ్వడం సాధ్యమవుతుంది. విద్యుత్‌తోనే అభివృద్ధి, మెరుగైనజీవితం ఆధారపడి ఉన్నది. అందుకే ప్రస్తుత అవసరాలు తీరడంతోపాటు భవిష్యత్ అవసరాలకు విద్యుత్ ఉత్పత్తిని పెంచుతున్నాం. ఇక ఇప్పుడు తెలంగాణ కరంట్ కోతలంటే ఏమిటో తెలియని రాష్ట్రంగా మారింది అని సీఎం తెలిపారు.(Source: Namasthe Telangana).
No comments:
Post a Comment